ఢిల్లీ వాయుకాలష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాయుకాలుష్యం తీవ్రముప్పు పొంచిఉన్న నేపథ్యంలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని, నాలుగు వారాల్లో ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని నగరంలో గాలి కాలుష్య నివారణకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ బోర్డు కీలక ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో గాలి కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణమని తెలిపింది. కనుక అధిక కాలుష్యాన్ని కలిగింపజేసే వాహనాలను దశలవారిగా తొలిగించాలని AQMB కోర్టుకు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు విధానాలను సవరించాలని పేర్కొంది. పాత వాహనాలను మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహాకాలు అందించాలని తెలిపింది.
అంతేకాకుండా ప్రస్తుతమున్న మెట్రో నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించాలని AQMB కోర్టుకు నివేదించింది. అయితే ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలు విన్న కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.


