ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు?కేసులో ఇంకా ఏం మిగిలింది?. అంటూ ప్రశ్నించింది.
‘‘ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము. మీ పర్పస్ పూర్తయిందా లేదా? కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని, ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభాకర్ రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా? ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు. ఆయన దర్యాప్తుకు సహకరిస్తారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీంకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది.


