
సాక్షి, అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం తిరుపతి జిల్లా డక్కిలిలో 8.4 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.