
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అక్టోబర్ నెలలో 10+10+11..
అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.
ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ పాస్‌లు