
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు(శనివారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Mumbai is experiencing heavy rainfall with an Orange Alert in effect. Water-logging and reduced visibility have been reported in several areas.
Mumbaikars are advised to avoid non-essential travel and to exercise caution while venturing out.
Police have been instructed to be on…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) August 15, 2025
భారీ వర్షాల కారణంగా విఖ్రోలి వెస్ట్ సమీపంలోని కొండచరియలు విరిగిపడగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీచేసినందున ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు.
#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city.
Visuals from Gandhi Market. pic.twitter.com/2mAbfXySWv— ANI (@ANI) August 16, 2025
‘ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందనే రిపోర్టులు వస్తున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముంబై పోలీసులు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’అని ముంబై పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.
భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్‌లలో భారీ వర్షాలు కురియనున్నాయని హెచ్చిరించింది. పాల్ఘర్‌లో ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా భారీ వర్షాల కారణంగా నగరంలోని వాషి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, అంధేరి, కుర్లా, చెంబూర్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city.
Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025
రైల్వే ట్రాక్‌లు నీటితో నిండిపోయాయి. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది.
కాగా గురువారం ముంబైలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ కొలాబా అబ్జర్వేటరీ వద్ద 53 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city.
Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025