Sudan: కొండచరియలకు గ్రామం నేలమట్టం .. వెయ్యి మంది మృతి.. ఒక్కరే సజీవం | Sudan Over 1000 Dead After Landslide | Sakshi
Sakshi News home page

Sudan: కొండచరియలకు గ్రామం నేలమట్టం .. వెయ్యి మంది మృతి.. ఒక్కరే సజీవం

Sep 2 2025 1:13 PM | Updated on Sep 2 2025 1:13 PM

Sudan Over 1000 Dead After Landslide

సూడాన్‌: ఆఫ్రికాలోని సూడాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆగస్టు 31న మర్రా పర్వతాలలోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడి వెయ్యిమంది మరణించగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని  సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో గ్రామం పూర్తిగా నేలమట్టమైందని, వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఆర్మీ తెలిపింది. మృతదేహాల వెలికితీతలో సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవతా సంస్థలకు సూడాన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సూడాన్ సాయుధ దళాలు,  పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న పౌర సంఘర్షణ నుండి తప్పించుకుని పలువురు మర్రా పర్వత గ్రామంలో ఆశ్రయం పొందారు. ఇప్పుడు ప్రకృతి పవిపత్తు వారినందరినీ బలితీసుకుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement