వెరీ డేంజర్: ఢిల్లీ కారు బాంబు పేలుళ్లలో ‘మదర్ ఆఫ్ సైతాన్’! | TATP Suspected in Red Fort Blasts | Sakshi
Sakshi News home page

వెరీ డేంజర్: ఢిల్లీ కారు బాంబు పేలుళ్లలో ‘మదర్ ఆఫ్ సైతాన్’!

Nov 16 2025 12:11 PM | Updated on Nov 16 2025 12:57 PM

TATP Suspected in Red Fort Blasts

నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో అత్యంత ప్రమాదకరమైన "ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్" (టీఏటీపీ) వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి.ఈ పేలుడు పదార్థం తీవ్రత చాలా అధికంగా ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ భారీ పేలుళ్ల ఘటనలో టీఏటిపీనే వాడారని తెలిపాయి.

ఈనెల 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుడుపై ఫోరెన్సిక్ బృందాల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కారులో అక్రమ రవాణా చేస్త్నున పేలుడు పదార్థాలు "టీఏటీపీ"గా ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. అయితే ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో ఈ పేలుడు పదార్థం వాడినట్లు పూర్తిగా నిర్ధారించపోయిన అదే అయిఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల నుంచే వారికి చేరి ఉండవచ్చని భావిస్తున్నాయి. "టీఏటీపీ"ని పేల్చివేయడానికి, అమ్మెనియం నైట్రేట్ లా కేవలం డిటోనేటర్లు అవసరం లేదని అధిక వేడిమి తాకితే ఆ పేలుడు పదార్థం ఆటోమెటిక్ గా విస్పోటనం చెందుతుందని వెల్లడించాయి. ఈ పేలుడు పదార్థం లక్షణం ఖచ్చితంగా ఆ కారు నడుపుతున్న ఉగ్రవాది ఉమర్ కు తెలుసని అయినప్పటికీ  రద్దీ ప్రదేశాల్లో కారు నడపారని ఫోరెన్సిక్ బృందాలు భావిస్తున్నాయి.

టీఏటీపీ పేలుడు పదార్థాన్ని "మదర్ ఆఫ్ సైతాన్" గా భావిస్తారు. 2015లో పారిస్ లో జరిగిన బాంబుపేలుళ్లు, 2016 బ్రస్సెల్స్, 2017 మంచెస్టర్ పేలుళ్ల తర్యాత టీఏటీపీ వాడకం గురించి తెలిసింది. ఈ పేలుడు పదార్థం ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థల నుంచే ఉమర్ కు అంది ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లేదా  టీఏటీపీని తయారు చేయాలనుకుంటే దానికి వివిధ రకాల రసాయనాలు అవసరమని వాటిని ఉమర్ ఏలా సేకరించాడు. అతనికి ఎవరెవరు సహకరించారు అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఎర్రకోట పేలుళ్లకు సంబంధించి ఉమర్ సన్నిహితులు షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇళ్లనుంచి దాదాపు 3 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement