
ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు మంచి స్టప్ దొరికేసింది. ‘‘నగరం మునిగిపోతున్నప్పుడు కూడా మేము మీమ్స్ చేస్తాం" అంటూ సరదాగా నవ్వులు పూయిస్తున్నారు. వరదలపై నెటిజన్లు కాస్త గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్‌లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓ యూజర్.. ముంబైలో కొత్త సేవలు ప్రారంభమయ్యాయంటూ.. సబ్‌మెరైన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫన్నీగా మిమ్స్‌ను రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.
ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి.. నగరంలోని కుండపోత వర్షానికి అలవాటు పడ్డామంటూ సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వర్షం కురుపిస్తున్నారు. "స్పిరిట్ ఆఫ్ ముంబై" అనే పదాన్ని కొంతమంది విమర్శిస్తూ కూడా మీమ్స్ చేస్తున్నారు. వర్షాలపై ప్రజలు మీమ్స్ ద్వారా తమ అనుభవాలను వ్యక్తపరస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
New service launched in Mumbai 😂 #MumbaiRains
pic.twitter.com/gDIlVjyDPo— V🐧 (@Vtxt21) August 18, 2025
నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం అంచనా వేసింది. నాందేడ్ జిల్లాలోని ముఖెడ్ తాలుకాలో వర్షాలు, వరదల్లో ఏడుగురు చనిపోయారు. వరదల్లో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.
Mumbaikar right now. #MumbaiRains #MumbaiRain pic.twitter.com/79LMu8LrBt
— Siddhanth Pilania (@sidhanthpilania) August 18, 2025
ఆర్మీ బృందాన్ని సహాయక చర్యల కోసం పంపించారు. జిల్లాలోని లెండి డ్యామ్‌లో భారీగా వరద చేరింది. ఇంకా, మహానగరం ముంబైలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఉదయం రెడ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడటంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
మాతుంగ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద నీటిలో నిలిచిపోయిన స్కూలు బస్సు నుంచి ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో కొన్ని విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. ఒక విమానాన్ని దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు తెలిపారు. అవసరమైతేనే ఇళ్లు వదిలి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.
అరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో సోమవారం 6 నుంచి 8 గంటల వ్యవధిలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దీంతో, లోకల్ రైళ్లు కనీసం 10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. సబర్బన్ రైళ్లు, సెంట్రల్ రైల్వే మార్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముంబైలోని విద్యాసంస్థలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సెలవు ప్రకటించారు. వర్షాలు కొనసాగే అవకాశాలుండటంతో మంగళవారం సైతం సెలవు ప్రకటించారు.
Mumbaikar stuck on roads everyday..
#MumbaiRains pic.twitter.com/cqVrkWJbK6— KKthewealthcoach (@MemeOverlord_kk) August 18, 2025