సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


