
సాక్షి,హైదరాబాద్: నగరంలో భారీవర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆఫీసులు ముగించి ఇంటికి వచ్చే సమయం కావడంతో వరదనీరు రోడ్డుపైకి చేరింది. ఫలితంగా పలు కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.

జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్,కొండాపూర్ ఫిలింనగర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మోహిదీపట్నం, బహదూర్‌పల్లి, సూరారాం, చింతల్, జీడిమెట్ల, శాపూర్‌నగర్, గాజులరామారంలలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం తీవ్రతతో జీహెచ్‌ఎంసీ,హైడ్రాతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. కురుస్తున్న వర్షం ధాటిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు నగర వాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
