Punjab: భీకర వరదలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 1,018 గ్రామాలు నీట మునక | Punjabs Worst Floods in Nearly 4 Decades | Sakshi
Sakshi News home page

Punjab: భీకర వరదలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 1,018 గ్రామాలు నీట మునక

Aug 31 2025 10:10 AM | Updated on Aug 31 2025 10:10 AM

Punjabs Worst Floods in Nearly 4 Decades

చండీగఢ్‌: పంజాబ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా మూడు లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 1,018 గ్రామాలు నీట మునిగాయి. 1988లో సంభవించిన వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో వరదలు పంజాబ్‌ను చుట్టుముట్టాయి.  

పంజాబ్‌లో తాజాగా సంభవించిన వరదలు వెయ్యికి పైగా గ్రామాలను ప్రభావితం చేశాయి. మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద విపత్తులకు ముగ్గురు మరణించినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, జమ్ముక కశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, తర్న్ తరణ్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపుర్తలా హోషియార్‌పూర్ జిల్లాల్లో వరదలు సంభవించాయి.
 

ప్రాథమిక నివేదికల ప్రకారం సరిహద్దు జిల్లా ఫాజిల్కాలో 41,099 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. పంజాబ్ జల వనరుల మంత్రి బరీందర్ కుమార్ గోయల్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న గ్రామాలలో దాదాపు మూడవ వంతు గ్రామాలు గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్నాయన్నారు. గురుదాస్‌పూర్‌లో 2,571 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఫజిల్కాలో 1239 మందిని తరలించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 77 సహాయ శిబిరాల్లో 4,729 మంది ఆశ్రయం పొందుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement