
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు(సెప్టెంబర్ 21, ఆదివారం) తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో కుండపోత తప్పదంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో..
మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, కొత్తగూడెం, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, పిడుగులతో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉపరితల ఆవర్తనం (surface circulation) ప్రభావంతో.. వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి ఎండలు దంచి కొడుతూ.. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి.
ఐంఎడీ అంచనా ప్రకారం ఈ నెలలో సాధారణం కంటే 109% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో రాగల 10 రోజులూ ఈ తరహా వర్షాలు తప్పవని, ఇవి ఆకస్మిక వరదల ముప్పు దారి తీయొచ్చని హెచ్చరిస్తోంది.