సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
3వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలివేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురవొచ్చు.
4వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురంభీంఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురవొచ్చు.
5వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్–మల్కాజ్‌గిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు (వేగం గంటకు 30–40 కి.మీ.) జనగాం, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా వీచే అవకాశం ఉంది.
6వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (వేగం 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.
హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్– మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా బలమైన ఉపరితల గాలులు (వేగం 30–40 కి.మీ.) వీచే అవకాశం ఉంది.
7వ తేదీ: అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.


