
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 18) నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, మారేడ్‌పల్లి, ఉప్పల్, సుల్తాన్‌బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, మణికొండ, షేక్‌పేట, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఫలితంగా రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి..నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది.
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. మోకాళ్లలోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
