
సాక్షి,హైదరాబాద్: నార్సింగ్-అప్పారోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా నార్సింగ్-అప్పారోడ్డులో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అటువైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా గమ్య స్థానాలకు వెళ్లాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు
ఇలా ఉంటే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో మరోసారి రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.