
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది(Hyderabad Heavy Rains). ఇవాళ, రేపు అతిభారీ వర్షం కురవొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు సైతం జారీ చేశారు. అయితే..
హైదరాబాద్ వర్షాలకు రోడ్లు ఎలా మారతాయో తెలిసిందే. పైగా సాయంత్రం సమయంలో ట్రాఫిక్ చిక్కులతో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఐటీ కంపెనీలకు హైదరాబాద్ పోలీసు శాఖ ఓ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు ఇవాళ ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు(Work From Home)కల్పించాలని కోరింది.
భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఉద్యోగులను ఇంటి నుంచే పనులు చేసుకునేందుకు అనుమతిస్తే ఊరట ఉంటుందని సైబరాబాద్ పోలీసులు కోరారు. అదే సమయంలో.. ఉద్యోగులు సైతం కంపెనీలకు, మేనేజర్లకు వర్క్‌ఫ్రం హోం(WFH) ఇవ్వాలంటూ సందేశాలు పెడుతున్నారు. దూర ప్రయాణాలకు బదులు ఈ వెసులు బాటు కల్పించాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు రూట్లలో రోడ్లపై వరద నీరు చేరగా.. ట్రాఫిక్ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: వానలు కదా.. అతని ఆన్సర్‌తో కంగుతిన్న హెచ్‌ఆర్!