
సాక్షి,విశాఖ: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం (ఆగస్ట్10) రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో భాగంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం ,కర్నూలు, అనంతపురం, అన్నమయ్య , వైఎస్సార్ ,నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 30 నుంచి 40కి.మీ వేగంతో గాలువు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

