
పాకిస్థాన్‌లో గత నెల రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కురిసిన ఈ భారీ వర్షాలకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించినట్టు సమాచారం. ఈ వర్షాలకు 300 మంది పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా వందలాది మంది గాయపడ్డారు. భారీ వరదలకు రోడ్లు, వంతెనలు, భారీ చెట్లు సైతం కొట్టుకుపోయాయి.
వందలాది మంది ఇల్లులు దెబ్బతిని నిరాశ్రయులుగా మిగిలారు. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. పాక్ విపత్తు నిర్వాహణ సంస్థ పంచుకున్న డేటా ప్రకారం పాకిస్తాన్ వరదల్లో 140 మంది చిన్న పిల్లలతో సహా కనీసం 299 మంది మరణించినట్టు తెలిపింది. దాంతో పాటు 428 మూగజీవాలు కూడా మరణించినట్టు తన డేటాలో పేర్కొంది.