పొద్దున్నే ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. చెరువులైన రహదారులు | Delhi Wakes up to Waterlogged Roads After Overnight-rain | Sakshi
Sakshi News home page

పొద్దున్నే ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. చెరువులైన రహదారులు

Aug 3 2025 7:08 AM | Updated on Aug 3 2025 7:12 AM

Delhi Wakes up to Waterlogged Roads After Overnight-rain

న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) ఉదయం నుంచి రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్లు ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. గురుగ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా జలమయమైన ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జనం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
 

విజయ్ చౌక్, కన్నాట్ ప్లేస్, మింటో బ్రిడ్జి, సరోజినీ నగర్, ఎయిమ్స్, పంచకుయన్ మార్గ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతమయ్యింది. జనపథ్, లజ్‌పత్ నగర్, మింటో బ్రిడ్జిలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. డియోలి ప్రాంతానికి చెందిన  దృశ్యాలు వర్షం తీవ్రతను చూపించాయి. ఈ మార్గాలలో రాకపోకలు సాగించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పంచకుయన్ మార్గ్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో వర్షం కారణంగా వాహనాలు నీటిలో నడుస్తున్నట్లు, ట్రాఫిక్, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడాన్ని చూపిస్తున్నాయి. సరోజినీ నగర్, కన్నాట్ ప్లేస్‌లలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
 

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం బహదూర్‌గఢ్, మనేసర్ తదితర ఎన్‌సీఆర్‌ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. లోని దేహత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్  బల్లభ్‌గఢ్‌లతో సహా  ఢిల్లీ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
 

ఢిల్లీలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  ఇది సాధారణ సగటు కంటే 1.1 డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.4 డిగ్రీలు తక్కువ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సంతృప్తికరమైన వర్గంలోనే ఉంది శనివారం సాయంత్రం 6 గంటలకు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 84గా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement