
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నేటి(బుధవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వరుసగా రెండవరోజు కూడా ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం కూడా రాజధానిలో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
#WATCH | Delhi: Rain lashes parts of the national capital.
(Visuals from Rao Tula Ram Marg) pic.twitter.com/V3AlLZAAcE— ANI (@ANI) July 23, 2025
భారీ వర్షానికి నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రుతుపవనాలు తీవ్రతరం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కురిసిన వర్షానికి ఎక్స్ ప్రెస్ ఎన్‌క్లేవ్ రోడ్దు, కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ సమీపంలోని అనువ్రత్ మార్గ్‌లోని రెండు క్యారేజ్‌వేలలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఢిల్లీ వాతావరణ బేస్ స్టేషన్ అయిన సఫ్దర్‌జంగ్‌లో మంగళవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య 8.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని రిడ్జ్‌లో 22.4 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఢిల్లీలో 136.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
Very heavy #rain in #Noida Filmcity #Monsoon#Delhirain#Raining#WeatherUpdate pic.twitter.com/RVR099hdSj
— Shweta (@imshwetta) July 23, 2025