నిలోఫర్ కేఫ్ యజమాని కానుక
నాంపల్లి (హైదరాబాద్): నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు వడ్డీ కాసులవాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం సమర్పించారు. రూ.నాలుగున్నర కోట్ల విలువైన ఈ కానుకను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన అందజేశారు. దైవదర్శనానికి వెళ్లిన సమయంలో యజ్ఞోపవీతం ఇస్తావా? అని దేవుడు అడిగినట్లు అనిపించిందని.. వెంటనే దాన్ని తయారు చేయించి నెల రోజులు తిరగకుండానే టీటీడీకి అందజేశానని బాబూరావు తెలిపారు.


