చికెన్‌ అడిగినందుకు చితక్కొట్టారు! | Chicken War at Kakatiya University | Sakshi
Sakshi News home page

చికెన్‌ అడిగినందుకు చితక్కొట్టారు!

Feb 24 2026 7:10 AM | Updated on Feb 24 2026 7:10 AM

Chicken War at Kakatiya University

హనుమకొండ: చికెన్‌ కోసం కాకతీయ వర్సిటీ లోని న్యూపీజీ బాయ్స్‌ హాస్టల్‌ విద్యార్థులు ఆదివారం రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నా రు. ఆరుగురికి గాయాలుకాగా, అందులో ఒకరి తలకు తీవ్రగాయమైంది. పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 20మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. న్యూపీజీ బాయ్స్‌ హాస్టల్‌లో మూడు విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు మెస్‌ కమిటీలో ఉన్నారు. 

ఆదివారం బాయ్స్‌ హాస్టల్‌ మెస్‌లో చికెన్‌తో కూడిన భోజనం పెట్టారు. కొంత చికెన్‌ మిగిలి ఉండడంతో ఓ విభాగానికి చెందిన విద్యార్థి తనకు భోజనంలోకి చికెన్‌కావాలని అడిగారని సమాచారం. దీంతో మరో విభాగానికి చెందిన విద్యార్థి గదిలో ఉందని పిలిచి అక్కడికి వెళ్లాక అతనిపై దాడిచేసి కొట్టినట్లు సమాచారం. ఆ తరువాత ఆ విద్యార్థి తన విభాగానికి చెందిన విద్యార్థులకు తెలియజేయగా, సాయంత్రం కొట్టిన మరోవర్గం విద్యార్థులను ఓ గదిలోకి తీసుకెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఇలా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చివరికి పోలీసుల దృష్టికి వెళ్లడంతో కొందరు పోలీసులు హాస్టల్‌ వద్దకు వెళ్లారు. వారి ముందే తోపులాట, దాడులకు ప్రయతి్నంచారని సమాచారం.

 ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఆయా రెండువర్గాల విద్యార్థులను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తరువాత వదిలేశారు. రాత్రి 11గంటల ప్రాంతంలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తింది. కర్రలతో దాడి చేసుకున్నట్లు సమాచారం. వీడియోల ఆధారంగా దాడులకు పాల్పడిన విద్యార్థులను గుర్తిస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా,   విద్యార్థి సంఘాల నేతలతో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజి్రస్టార్‌ రామచంద్రం, ఏసీపీ నర్సింహారావు చర్చించారు., ఘర్షణ వీడియోలు పరిశీలించి వివరాలు సేకరించాక కేసులు నమోదైన విద్యార్థుల  హాస్టల్‌ అడ్మిష న్‌ రద్దుచేయాలనే యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement