ప్రైవేటుపై మోజు..క్యాన్సర్‌ ఆస్పత్రికి బూజు | Coalition government conspiring to build a private cancer hospital under the auspices of a Dubai company | Sakshi
Sakshi News home page

ప్రైవేటుపై మోజు..క్యాన్సర్‌ ఆస్పత్రికి బూజు

Oct 25 2025 5:31 AM | Updated on Oct 25 2025 5:31 AM

Coalition government conspiring to build a private cancer hospital under the auspices of a Dubai company

ఇక ఉచితానికి మంగళమే!  

ప్రైవేటు క్యాన్సర్‌ ఆస్పత్రి తీసుకొచ్చే ప్రయత్నాలు 

దుబాయ్‌ కంపెనీతో ఒప్పందం  

అందుకే ఏడాదిగా నిధులు విడుదల చేయని టీటీడీ 

400 పడకల ఆస్పత్రిని 100కే పరిమితం   

అరిగిపోయిన, పనిచేయని పరికరాలతో వైద్యుల అవస్థలు

కూటమి ప్రభుత్వం.. కార్పొరేట్‌కు సలాం.. బడా కంపెనీల అడుగులకు మడుగులు.. ప్రైవేట్‌తో ఒప్పందం..సర్కారు వైద్యానికి మంగళం.. ఫలితం పేద రోగుల ప్రాణాలు అర్పణం. ఇదీ నేటి సర్కారు స్థితి. తిరుపతిలోని ఉచిత క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్వీర్యమే ఇందుకు నిదర్శనం. ‘క్యాన్సర్‌ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. 

పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కా వాన్న ఆశయంతో మాజీ సీఎం వైఎస్‌  జగన్‌ మోహన్‌రెడ్డి తన హాయాంలో నిర్మా ణం చేపట్టిన క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాయి తగ్గించడంతోపాటు నిధులు విడుదల చే యకుండా దుబాయ్‌ కంపెనీతో టీటీపీ ప్ర భుత్వం ఒప్పందం చేసుకోవడంతో క్యాన్సర్‌ రోగులు ఆందోళన చెందుతున్నారు.  

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రైవేటు మోజులో కూటమి సర్కారు.. ఉచిత క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్యీర్యం చేస్తోంది. ఉచితంగా క్యాన్సర్‌ వైద్యసేవలు అందించే తిరుపతి శ్రీబాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీని ప్రాణం తీసి.. దుబాయ్‌ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేటు క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు దుబాయ్‌లో బుర్జిల్‌ హెల్త్‌కేర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయం కూటమి గెజిట్‌ పత్రిక ద్వారా వెళ్లడించింది. 

వివరాల్లో కెళితే.. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ఆస్పత్రి క్యాన్సర్‌ రోగుల పాలిట వరంలా మారింది. ‘క్యాన్సర్‌ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కావాలి’’.. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి అధికారుల సమావేశంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్న మాటలు ఇవి. ఆయన ఆదేశాల మేరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతిలో స్విమ్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా 400 పడకలతో శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. 

నాటి సీఎం ఆదేశాల మేరకు 2022లో స్విమ్స్‌ గవర్నింగ్‌ బాడీ తీర్మానం చేసి టీటీడీకి పంపింది. 2023 ఫిబ్రవరిలో టీటీడీ అంగీకారం తెలిపింది. అదే ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ సుమారు రూ.130 కోట్లు బడ్జెట్‌ కేటాయించింది. మరో రూ.100 కోట్ల స్విమ్స్‌ నిధులతో కలిపి అదే ఏడాది సెప్టెంబర్‌ 20న పనులు ప్రారంభించింది. 2024 అక్టోబర్‌లో క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించేందుకు నిర్మాణ పనులు వేగంగా చేపట్టారు. కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం పూర్తి కాలేదు.

కూటమి రాకతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్‌ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్‌ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్‌ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా పెండింగ్‌ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్‌ ఆస్పత్రి జనరల్‌ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా వైద్య­సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్‌ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెట్ల కింద.. పుట్ల చాటున క్యాన్సర్‌ రోగులు
నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా వైద్యసేవలందించాలనే లక్ష్యంతో నాడు వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన క్యాన్సర్‌ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే క్యా న్సర్‌ రోగులకు బెడ్లు దొరక్కపోవడంతో చెట్ల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టు కుని బిక్కు బిక్కుమంటున్నారు. తిరుపతిలోని క్యాన్సర్‌ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితులను చూసిన రోగులు కొందరు ఇంటి వద్ద బాధపడుతుండగా, మరి కొంద రు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నట్లు తెలిసింది. 

ప్రస్తుతం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్వహణపై వైద్యులు కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఏడాదికి 70 వేల నుంచి 80 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రాధేయపడినట్లు తెలిసింది. ఆస్పత్రి అభివృద్ధి చెందితే మరో 200 మందికిపైగా వైద్యులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కోరినట్లు సమాచారం. 

ఈ పరిస్థితుల్లో దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో ద్వారా తెలుసుకున్న క్యాన్సర్‌ రోగులు షాక్‌ గురయ్యారు. ఉచితంగా వైద్య సేవలు అందించే ఆస్పత్రిని నిర్యీర్యం చేసి, ప్రైవేటు ఆస్పత్రిని తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడంపై రోగులు, బంధువులు మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement