
సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.
సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.
చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్‌లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారు
ఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.
హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు సమాన బాధ్యత ఇచ్చారు
లా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.

జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్‌లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.
తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.
పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.