మత్తు పదార్థాలిచ్చి బాలికపై అఘాయిత్యం | Kovur incident | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలిచ్చి బాలికపై అఘాయిత్యం

Feb 2 2026 5:40 AM | Updated on Feb 2 2026 5:40 AM

Kovur incident

కోవూరులో గంజాయి బ్యాచ్‌ దారుణం 

కోవూరు: గంజాయి మత్తులో ఇద్దరు బాలురు ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. విచక్షణ మరిచి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని కొత్తకాలనీలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కోవూరుకు చెందిన మైనార్టీ బాలిక(12)పై అదే కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు కన్నేశారు.

శుక్ర­వారం గంజాయి మత్తులో ఉన్న వీరు బాలిక దుకాణానికి వెళ్లొస్తుండగా మాటేసి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళారు. అప్పటికే వైట్‌నర్‌ను కలిపి సిద్ధం చేసిన నీటిని తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే మృగాల్లా మారి లైంగిక దాడి చేశారు. మత్తు దిగిన త­ర్వాత బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని, తల్లిదండ్రులకు తనపై జరిగిన అమానుషాన్ని వివరించింది. పోలీసులకు సమాచారం అందించడంతో బాలికను నెల్లూ­రు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యా­దు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement