సాక్షి, శ్రీసత్యసాయి: మడకశిర టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు(TDP MLA MS Raju) మరో వివాదంలో చిక్కుకున్నారు. భగవద్గీతపై(bhagwat geeta) టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వీహెచ్‌పీ(VHP) నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ(TTD Board) బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇక, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ నేతలు స్పందించారు. ఈ సందర్బంగగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.


