Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Jan 28 2026 7:34 AM | Updated on Jan 28 2026 11:29 AM

Devotees Rush At Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,049 మంది స్వామివారిని దర్శించుకున్నారు.  21,469 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. 

దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement