మహోజ్వలిత చరితకు మారుపేరు... మంత్రపురి దేవాలయాలు
ప్రపంచంలోనే ఏకైక సత్యసాయి సుందరమందిరం
దక్షిణ భారతదేశంలోనే పశ్చిమ ముఖం గల శివలింగం
తాజాగా టీటీడీ నూతన ఆలయాల్లో మంథనికి చోటు
మంథని: ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకు పైగా మహోన్నత చరిత్ర కలిగిన మంత్రపురి దేవాలయాలకు నిలయమై టెంపుల్ టౌన్‌గా కూడా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ వినాయకుని గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమముఖ శివలింగం పెద్దపల్లి జిల్లా మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో ఒక్క వేంకటేశ్వర స్వామి ఆలయం మినహా అన్నిదేవతల ఆలయాలను పురాణకాలంలోనే నిర్మించారు. ఇటీవల మరిన్ని దేవాలయాలు వెలిశాయి. తాజాగా గురువారం తెలంగాణలో కొత్తగా మూడు దేవాలయాలు నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రకటించారు. ఇందులో కరీంనగర్, దుబ్బాక, మంథనికి చోటు కలి్పంచారు. కాగా మంథని మండలం కన్నాల గ్రామంలో సెంటిమెంట్ టెంపుల్‌గా పేరున్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. కానీ, టీటీడీ దేవాలయ నిర్మాణంలో మంథనిలో అన్ని దేవాలయాలకు ప్రసిద్ధిగా పరిఢవిల్లనుంది.
అన్ని దేవతామూర్తుల ఆలయాలు
ప్రసిద్ధి గాంచిన మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయంతోపాటు కన్యకా పరమేశ్వరి, లలితాదేవి, సరస్వతీ అమ్మవారి దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే 11 పురాతన హనుమాన్ దేవాలయాలతో పాటు నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం.. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమ ద్వారం, పశి్చమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. మరో ఐదు శివాలయాలు ఉన్నాయి. మంథని పట్టణానికి ఉత్తర ముఖంలో వెలసిన మహాగణపతి ఆలయం భక్తులకు అభయమిస్తూ పూజలు అందుకుంటోంది. పూజల్లో మొదటి ఆదిదేవుడైన గణపతినే కొలుస్తారు. ఇక్కడ గణపతికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది.
గౌతమేశ్వరుడు
మంథని పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నది పక్కన ఎత్తయిన ప్రదేశంలో ప్రాచీన కళ ఉట్టిపడుతుండేదే గౌతమేశ్వరాలయం. శతాబ్ద కాలం క్రితం ఈ దేవాలయాన్ని వొజ్జల కిష్టయ్య అనే వ్యక్తి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం ఎన్నోసార్లు గోదావరి నది ఆటుపోట్లకు గురైనా చెక్కు చెదరకుండా ఉంది. దేవాలయ ప్రాంగణంలోని పురాతన ఆలయాలు కొంత మేరకు దెబ్బ తిన్నాయి. ఈ ప్రాంగణంలో శివపంచాయనం, రామాలయం, సరస్వతి, లక్ష్మీదేవిల ఆలయాలు ఉన్నాయి.
దత్తాత్రేయ ఆలయం
మంథని పట్టణ సరిహద్దులో నిర్మించిన దత్తాత్రేయ ఆలయం ఈ ప్రాంత భక్తులకు కొంగుబంగారమైంది. అరవై ఏళ్ల క్రితం మంథనికి చెందిన దోమల రాధమ్మ శిష్యుడైన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజాకిషన్ ప్రసాద్ సహాయంతో ఈ దేవాలయం రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఏటా ఈ ఆలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను, నవరాత్రులను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.
శీలేశ్వర – సిద్ధేశ్వర ఆలయం
పట్టణ నడి»ొడ్డున వెలసిన శీలేశ్వర–సిద్ధేశ్వరాలయం మంథని చరిత్రకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. కాకతీయ సైన్యా«దీశుడు శీలప్పనాయుడు, సిద్ధప్పనాయుడుల జ్ఞాపకార్థం ఈ దేవాలయాన్ని ప్రోలరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. మంథనికి చెందిన లోకె రామన్న రామానాంద్ర సరస్వతీ స్వామిగా సన్యాసం స్వీకరించి 1942లో ఆలయాన్ని పునరుద్ధరించారు. సుందరమైన శిల్పసంపదతో నిర్మించిన ఈ ఆలయంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయంలో గర్భగుళ్లకు ఇరువైపులా నల్లరాతితో చెక్కిన నందీశ్వరులను, నాట్య మయూరిల విగ్రహాలను ఏర్పాటు చేశారు.
చింతపండు స్వామి
వీణవంక నుంచి చింతపండు బండ్లపై వచి్చన లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని వరదరాజ స్వామి ఆలయంలో ప్రతిíÙ్ఠంచారు. ఈ దేవాలయానికి మంథని చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుడ విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆండాళ్ అమ్మవారు, గోదాదేవి, శ్రీకృష్ణార్జునుల విగ్రహాలు దర్శనమిస్తాయి.
పశి్చమ ముఖ శివలింగం
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశి్చమ ద్వారం, పశి్చమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలిచే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీలేశ్వర– సిద్ధేశ్వర దేవాలయం, సురాబాండేశ్వరుడు, గౌతమేశ్వరుడు, ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నారు. వీరబ్రహ్మంగారి దేవాలయం, షిరిడీసాయి ఆలయం, అయ్యప్ప దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, బలవీర హనుమాన్ ఆలయం, నాగదేవత ఆలయం, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి మంత్రపురిలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు..


