మేఘం వర్షించదా.. లవ్‌ సాంగ్‌ రిలీజ్‌ | Megham Varshinchada Full Video Song Out from Arjun Chakravarthy | Sakshi
Sakshi News home page

మేఘం వర్షించదా.. 'అర్జున్‌ చక్రవర్తి' నుంచి లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

Aug 7 2025 4:45 PM | Updated on Aug 7 2025 4:58 PM

Megham Varshinchada Full Video Song Out from Arjun Chakravarthy

విజయ రామరాజు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthy Movie). విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్‌ లో 1.5 మిలియన్ల వ్యూస్ దాటింది. 

తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మేఘం వర్షించదా' రిలీజ్‌ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ కంపోజ్ చేసిన ఈ పాటకు విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ పాడారు. ఇక ఈ సినిమాలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్‌ చక్రవర్తి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

చదవండి: సలాం అనాలి సాంగ్‌ టీజర్‌: డ్యాన్స్‌ ఇరగదీసిన స్టార్స్‌.. కానీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement