
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.
ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది.
కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు