
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ప్రేమిస్తున్నా. ఈ సినిమాకు భాను దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు కనకదుర్గారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఎవరే నువ్వు అంటూ సాగే సాంగ్ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ సూపర్ హిట్ కావాలని విజయ్ సేతుపతి అన్నారు. ఈ పాటను పూర్ణ చంద్ర రచించగా.. సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.
దర్శకుడు భాను మాట్లాడుతూ...' మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్ను హీరో విజయ్ సేతుపతి విడుదల చెయ్యడం మా చిత్ర యూనిట్కు దక్కిన అదృష్టం. మా సినిమా కథను తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యడం విశేషం. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ సినిమా' అని తెలిపారు. ఈ సినిమాకు భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.