ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు | Megastar Chiranjeevi Praises his niece naira for singing song in his film | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు

Jan 21 2026 7:01 PM | Updated on Jan 21 2026 7:14 PM

Megastar Chiranjeevi Praises his niece naira for singing song in his film

మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా.. ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన 8 రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement