మెట్రో శిరీష్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా ‘నాన్ వయొలెన్స్’. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఏకే పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి తమిళ ‘కనగ’ పాట లిరికల్ వీడియోతో పాటు తెలుగు వెర్షన్ ‘కనకం’ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కనకం కన్నే కొడితే కసా పిసా అయిపోతారు... అందమే ఆరబోస్తే కొంప గూడు వదిలేస్తారు...’ అనే లిరిక్స్‌తో ‘కనకం’ పాట సాగుతుంది. ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించగా, తేజస్వినితో కలిసి ఈ చిత్రసంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పాడారు. ఈ పాటలో ‘మెట్రో’ శిరీష్, శ్రియ శరణ్‌ల ఎనర్జిటిక్ మూవ్స్ కనిపిస్తాయి. బాబీ సింహా, యోగిబాబు, అదితి బాలన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


