కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీని రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఓనమ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కిరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది. ఇంకెందుకు ఆలస్యం ఓనమ్ ఫుల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి.


