కీరవాణి నోట మరో అద్భుతమైన పాట.. 'వెళ్లేదారిలో..’ విన్నారా? | Velle Darilona Song Out From Sri Chidambaram Movie | Sakshi
Sakshi News home page

కీరవాణి నోట మరో అద్భుతమైన పాట.. హృదయాలను హత్తుకునేలా 'వెళ్లేదారిలో..’

Jan 22 2026 11:26 AM | Updated on Jan 22 2026 11:36 AM

Velle Darilona Song Out From Sri Chidambaram Movie

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విలేజ్‌ డ్రామా ‘శ్రీ చిదంబరం’. వినయ్‌ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్‌ పాటను విడుదల చేశారు. 

సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్‌ విషెస్‌ చెబుతూ పాటను విడుదల చేశారు. చందు రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్‌ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్‌ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ'' కీరవాణి గారు ఈ పాటలను ఆలపించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన గాత్రంతో ఆ పాట ఎంతో గొప్పగా మారింది. 

సినిమా విషయానికొస్తేఇదొక ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాలో పూర్తి కొత్తదనం నిండి ఉంటుంది. ప్రతి పాత్ర, ప్రతి విజువల్‌ ఎంతో సహజంగా ఉంటుంది.ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని ఎందుకు పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. కొత్తదనంతో నిండిన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా చిత్రం నచ్చుతుంది' అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement