
వరుణ్ తేజ్తో పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లో నాగ మోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చిత్తూరు పిల్లా అంటూ సాగే సాంగ్ను రిలీజ్ చేశారు.
(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్‌డేట్ వచ్చేసింది!)
పెళ్లి వేడుకలో వచ్చే ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పెళ్లిపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ, రితేష్ జి రావు పాడారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ ఈ సంగీతమందిచారు. ఈ చిత్రంలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The sound of love, joy, and celebration 💃🕺#ChittoorPilla lyrical video from #SathiLeelavathi is OUT NOW! 🎶
- https://t.co/abxPxwEmbx
A @MickeyJMeyer Musical 🎶
Sung by 🎤 : @Nutana_Mohan, @krishnatejasvi_ & #RiteshGRao
Lyrics by ✍: #Vanamali@ActorDevMohan @SatyaTatineni… pic.twitter.com/VM1IrkU1eh— Lavanya konidela tripathi (@Itslavanya) August 12, 2025