మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా మన శంకరవరప్రసాద్‌గారు సినిమా నుంచి శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
అప్పుడేమో ట్రోల్స్..
ఈ పాట విడుదలైన కొత్తలో ఇదేం పాట? అని ట్రోల్స్ వచ్చాయి. కానీ తర్వాత అదే హిట్టు సాంగ్‌గా మారిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన పాటలో నయనతారతో కలిసి హుషారుగా స్టెప్పులేశాడు చిరంజీవి. అది చూసిన అభిమానులు బాస్ గ్రేస్ చూస్తుంటే మరోసారి సినిమా చూడాలనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. భీమ్స్‌తో పాటు మధుప్రియ ఆలపించింది.


