K Ramp: కలర్‌ఫుల్‌గా ఓనం సాంగ్‌ | Onam Lyrical Song Released from Kiran Abbavaram K Ramp Movie | Sakshi
Sakshi News home page

K Ramp Movie: ఓనం లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Aug 9 2025 12:50 PM | Updated on Aug 9 2025 12:50 PM

Onam Lyrical Song Released from Kiran Abbavaram K Ramp Movie

'క' సినిమాతో అసలు సిసలైన హిట్‌​ కొట్టిన కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) దిల్‌రూబా చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాడు. ప్రస్తుతం ఇతడు కె- ర్యాంప్‌ సినిమా చేస్తున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ పతాకాలపై రాజేష్‌ దండా, శివ బొమ్మక్‌ నిర్మిస్తున్నారు.

ఓనం సాంగ్‌..
నేడు (ఆగస్టు 9) రాఖీ పండగను పురస్కరించుకుని కె- ర్యాంప్‌ (K - Ramp Movie) నుంచి ఓనమ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. 'ఇన్‌స్టా ఆపేశానే.. ట్విటర్‌ మానేశానే.. నీకే ట్యాగ్‌ అయ్యానే మలయాళీ పిల్ల..' అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. చేతన్‌ భరద్వాజ్‌, సాహితి చాగంటి ఈ పాట ఆలపించారు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించాడు. సురేంద్ర కృష్ణ లిరిక్స్‌ సమకూర్చాడు. పాట కలర్‌ఫుల్‌గా ఉంది. కిరణ్‌ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేశాడు. కె ర్యాంప్‌ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ అక్టోబర్‌ 18న విడుదల కానుంది.

 

చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్‌ బాబు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement