
బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కిష్కింధపురి. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ ఏడాది భైరవం తర్వాత బెల్లంకొండ నటిస్తోన్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఉండిపోవే నాతోనే బంగారం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ బెల్లంకొండ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. జావెద్ అలీ ఆలపించారు. ఈ సాంగ్‌ను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.