విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం గాంధీ టాక్స్. ఈ సినిమాకు కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే క్రేజీ మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
పదే పదే కంగారుగుంటది.. అంటూ సాగే ఈ మెలోడి లవ్ సాంగ్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. నయన్సీ శర్మ, శిబి శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.


