
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ చెలియా'. రూపాశ్రీ కొపురు నిర్మించగా ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద 'ఓ చెలియా' నుంచి తొలి పాటని రిలీజ్ చేశారు.
'నువ్వే చెప్పు చిరుగాలి' అని సాగే ఈ పాటని మంచు మనోజ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ గీతాన్ని సాయి చరణ్ ఆలపించగా, ఎంఎం కుమార్ బాణీని అందించారు. సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించబోతోన్నారు.