
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.