
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈనెల 25న విడుదల కావాల్సినా ఈ చిత్రం వారం రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో ఈ నెలాఖర్లో అంటే జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీలోని అన్నా అంటూనే సాగే ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. అనిరుధ్ ఆలపించారు. కాగా.. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.