మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమాలో 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాట పాడింది స్వయానా చిరంజీవి మేనకోడలు నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోదరి మాధవి గారి కుమార్తె అని వెల్లడించారు. మనశంకర వరప్రసాద్‌గారు సినిమాలోని ఈ పాటను అద్భుతంగా పాడిందని కొనియాడారు. ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#Naira is the niece of our Megastar @KChiruTweets garu ( Daughter of his Sister Madhavi garu )🤗
She has wonderfully sung the #FlyingHigh song from #ManaShankaraVaraPrasadGaru 👏🏻👏🏻👏🏻
With a long journey ahead of her, this is just a beautiful beginning… https://t.co/PZEPN1t3ox— Anil Ravipudi (@AnilRavipudi) January 20, 2026


