
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తోన్న తాజా యూత్ ఫుల్ లవ్ స్టోరీ బ్యూటీ. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్వీ సుబ్రహ్మణ్యం అందించగా.. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ప్రెట్టీ ప్రెట్టీ అంటూ రొమాంటిక్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ తాజా లవ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు విజయ బుల్గానిన్ సంగీతమందించగా.. సనారే లిరిక్స్ రాశారు. ఈ రొమాంటిక్ సాంగ్ను పీవీఎన్ఎస్ రోహిత్ పాడారు. ఈ సినిమాను సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటించారు.