మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమా 'వసుదేవసుతం'. వైకుంఠ్ బోను దర్శకుడు కాగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
మణిశర్మ సంగీతమందించిన 'ఏమైపోతుందో' అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. పవన్, శృతిక పాడారు. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ అందంగా చూపించారు. పాట రిలీజ్ చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. 'వసుదేవసుతం'లోని 'ఏమైపోతుందో' పాట చాలా బాగుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.


