
సినిమా పాటల్ని సైతం వెనక్కు నెడుతూ జానపద పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రాను బొంబాయికి రాను, సొమ్మసిల్లిపోతున్నవే.., ఆడనెమలి.., సీమదసర సిన్నోడు.. ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్‌లో మోత మోగిస్తున్నాయి. పల్సర్ బైక్ (Pulsar Bike Song) కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ పాట రిలీజైన కొత్తలో.. ఏ ఫంక్షన్‌లో చూసినా ఈ సాంగే మోగేది.
2018లో ఇండస్ట్రీకి..
ఇక ఈ ఒక్క పాటతోనే ఫుల్ సెన్సేషన్ అయ్యాడు సింగర్ రమణ (Singer Ramana). ఈ సాంగ్‌ను రవితేజ ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత పాపులారిటీ వచ్చింది. తాజాగా ఈ పాట గురించి రమణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 'నేను 2018లో ఈ ఇండస్ట్రీకి వచ్చాను. 2022లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. జీవితంలో ఊహించనంత పాపులారిటీ వచ్చింది. ఆ రోజుల్లో ఒక ఆడియో సాంగ్ చేయాలంటే రూ.15-20 వేలల్లో అయిపోయేది.
పల్సర్ బైక్‌కు ఎంతొచ్చిందంటే?
కానీ, ఆ రూ.20 వేలు కూడబెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈవెంట్‌కు వెళ్తే రూ.2-3 వేలు మిగిలేవంతే! ఎక్కువ డబ్బు వచ్చేది కాదు. పల్సర్ బైక్ ఆడియో సాంగ్ రూ.5-10 వేలల్లో అయిపోయింది. వీడియో సాంగ్ కూడా కలుపుకుంటే రూ.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. కానీ ఈ పాట మేము ఊహించని స్థాయిలో రూ.40-50 లక్షల డబ్బు తెచ్చిపెట్టింది' అని రమణ చెప్పుకొచ్చాడు.
చదవండి: అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా