గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో.. తండ్రి నిర్మాత, అన్న డైరెక్టర్ | 7g Brindavan Colony Actor Ravi Krishna Latest Pic And Details | Sakshi
Sakshi News home page

Guess The Actor: ఈ హీరో ఇలా అయిపోయాడేంటి.. అస్సలు గుర్తుపట్టలేరు

Mar 18 2026 6:46 PM | Updated on Mar 18 2026 6:50 PM

7g Brindavan Colony Actor Ravi Krishna Latest Pic And Details

వయసు మీద పడితే ఎవరైనా సరే మారిపోతారు. కొందరిని గుర్తుపట్టొచ్చు కానీ మరికొంతమందిని మాత్రం సడన్‌గా చూస్తే గుర్తుపట్టలేం. ఇప్పుడు అలానే ఓ హీరోకి సంబంధించిన లేటెస్ట్ ఫొటో వైరల్ అవుతోంది. అతడి కొత్త మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ నటి సదరు హీరోతో ఫొటోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)

కర్తవ్యం, భారతీయుడు, ఖుషి తదితర సినిమాలని నిర్మించిన ఏఎం రత్నం.. రీసెంట్ టైంలో అయితే పవన్ కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈయన పెద్ద కొడుకు జ్యోతికృష్ణ దర్శకుడు కాగా చిన్న కొడుకు రవికృష్ణ మాత్రం నటుడిగా మారాడు. పైన కనిపిస్తున్నది అతడే. 7జీ బృందావన కాలనీ మూవీతో అప్పట్లో అద్భుతమైన సక్సెస్ అందుకున్న రవికృష్ణ.. తర్వాతి కాలంలో అరడజనుకి పైగా చిత్రాలు చేసినప్పటికీ హిట్స్ కొట్టలేకపోయాడు. చివరగా 2011లో ఓ తమిళ సినిమా చేసిన ఇతడు.. ప్రస్తుతం 7జీ బృందావన కాలనీ సీక్వెల్ అయిన '7జీ రెయిన్ బో కాలనీ 2' చేస్తున్నాడు.

మలయాళ నటి అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్ కాగా తొలి పార్ట్ తీసిన సెల్వ రాఘవన్.. దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కమెడియన్ సుమన్ శెట్టి కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగానే దియా మెర్సి అనే నటి, రవికృష్ణతో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూస్తే రవికృష్ణ ఎంతలా మారిపోయాడో అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇతడికి 21 ఏళ్ల వయసున్నప్పుడు 7జీ మూవీ వచ్చింది. ఇప్పుడు 43 ఏళ్ల వయసులో దీనికి సీక్వెల్ చేస్తుండటం విశేషం.

రవికృష్ణ సోదరుడు జ్యోతికృష్ణ విషయానికొస్తే.. దర్శకుడిగా ఆరు మూవీస్ చేశాడు. క్రిష్ బయటకొచ్చేసిన తర్వాత 'హరిహర వీరమల్లు' మిగిలిన భాగానికి దర్శకత్వం చేశాడు. కానీ ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ అయ్యేసరికి కనుమరుగైపోయాడు.

(ఇదీ చదవండి: సరికొత్త 'స్పైడర్ మ్యాన్' సినిమా ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement