సరికొత్త 'స్పైడర్ మ్యాన్' సినిమా ట్రైలర్ రిలీజ్ | SPIDER MAN BRAND NEW DAY Movie Trailer Telugu | Sakshi
Sakshi News home page

SPIDER MAN BRAND NEW DAY: 'స్పైడర్ మ్యాన్' కొత్త మూవీ ట్రైలర్ చూశారా?

Mar 18 2026 5:37 PM | Updated on Mar 18 2026 5:37 PM

SPIDER MAN BRAND NEW DAY Movie Trailer Telugu

90స్ జనరేషన్ పిల్లల్ని ఎంతగానో అలరించిన 'స్పైడర్ మ్యాన్' నుంచి ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. 2021లో చివరగా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' పేరుతో రిలీజైన మూవీ ఆకట్టుకుంది. బాగానే కలెక్షన్స్ సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త చిత్రం రాబోతుంది. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' టైటిల్‌తో తీశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)

ట్రైలర్ బట్టి చూస్తే.. నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో అతడు న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణమేంటి? అనే విషయాల్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టామ్ హోలండ్, జెండాయా ప్రధాన పాత్రలు చేశారు. ఈ జూలై 31న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement