తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించిన ఏఎం రత్నం | AM Ratnam Meet To TFC Chairman For Hari Hara VeeraMallu Tickets Hike | Sakshi
Sakshi News home page

తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించిన ఏఎం రత్నం

Jun 2 2025 4:52 PM | Updated on Jun 2 2025 6:04 PM

AM Ratnam Meet To TFC Chairman For Hari Hara VeeraMallu Tickets Hike

పవన్‌ కల్యాణ్‌ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా  జూన్‌ 12న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపంథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఆశ్రయించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ఎపీలో టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతి ఇవ్వాలంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు ఆయన వినతి పత్రం అందించారు. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి త్వరలో సంప్రదించనుంది. ఆ సమయంలో 'హరిహర వీరమల్లు' సినిమాకు టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అదనపు షోలు రన్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరనుంది.

 'హరిహర వీరమల్లు'కు టికెట్ల రేట్ల పెంపు కోసం పవన్‌ కల్యాణ్‌ కొత్త స్కెచ్‌ వేశారని తెలుస్తోంది.  అందులో భాగంగానే తాజాగా నిర్మాత ఏఎమ్‌ రత్నం ద్వారా తన సినిమా కోసం టికెట్‌ ధరలు పెంపు, అదనపు షోల అనుమతి కోసం ప్లాన్‌ అమలు చేశారు. పవన్‌ సూచన మేరకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏఎమ్‌ రత్నం కలిశారని అర్థం అవుతుంది. డైరెక్ట్‌గా తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటే విమర్శలొస్తాయని  ఫిల్మ్ చాంబర్ ద్వారా పవన్‌ ఇలా స్కెచ్‌ వేశారని చెప్పవచ్చు. నేడో, రేపో  ఫిల్మ్ చాంబర్ నుంచి కొందరు ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్నారు. పవన్‌ తన సినిమా కోసం థియేటర్స్‌పై తనిఖీలు చేయించారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాకు ఇలా లబ్ధి పొందే ప్లాన్‌ను ఆయన అమలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement